క‌డ‌ప పెద్ద‌దర్గా ఉరుసు ఉత్స‌వాల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ హాజ‌రు

అమీన్‌పీర్ ద‌ర్గాలో ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు నిర్వ‌హించిన ముఖ్య‌మంత్రి

వైయస్‌ఆర్‌ జిల్లా: కడప న‌గ‌రంలోని ప్ర‌ముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అమీన్‌ పీర్‌ దర్గా (పెద్ద ద‌ర్గా) ఉరుసు ఉత్స‌వాల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వ‌హించారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా అమీన్‌పీర్‌ దర్గాకు చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌కు.. దర్గా పీఠాధిపతి స్వాగతం పలికారు. దర్గాలో ఛాదర్‌ సమర్పించిన సీఎం వైయస్‌ జగన్‌.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వ‌హించారు. సీఎం వైయస్‌ జగన్‌ వెంట డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఉన్నారు. 

అంత‌కుముందు క‌డ‌ప ఎయిర్‌పోర్టులో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నాయ‌కులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ద‌ర్గా స‌మీపంలో పార్టీ నాయ‌కులు, ప‌లువురు క‌డ‌ప న‌గ‌రవాసుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ క‌లిశారు. వారి యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 

Back to Top