చిన్నారి వైద్య చికిత్సకు సీఎం హామీ

ఏలూరు జిల్లా:  చిన్నారి వైద్య చికిత్స‌ల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలన నిమిత్తం వచ్చిన సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ  నేపథ్యంలో కొవ్వూరు మండలం ఔరంగబాద్ గ్రామానికి చెందిన పాక నాగ వెంకట అపర్ణ తన ఏడు నెలల కుమార్తె నిస్సి ఆరాధ్య కిడ్నీ సంబంధిత క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిపి ఆదుకోవాలని అర్జీని అందచేశారు. బేబీ నిస్సి అనారోగ్య పరిస్థితి తెలుసుకుని చలించి పోయిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌..తక్షణ ఆర్థిక సహాయం అందించి,  తగిన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంలో ఆ కుటుంబానికి అండగా నిలుస్తామని  సిఎం భరోసా ఇచ్చారు.

Back to Top