విశాఖ‌ప‌ట్నం చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

ఘ‌న‌స్వాగతం ప‌లికిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీశ్రేణులు

విశాఖ‌: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విశాఖ చేరుకున్నారు. మిలాన్‌–2022 యుద్ధనౌకల సమాహారంలో భాగంగా బీచ్‌రోడ్డులో జ‌రిగే ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌లో కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో కొద్దిసేప‌టి క్రితమే విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు, అధికారులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి నేవల్‌ డాక్‌ యార్డ్‌కి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చేరుకోనున్నారు. ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధనౌకను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. అనంతరం నౌకాదళ సిబ్బందితో కలిసి దానిని పరిశీలిస్తారు. సాయంత్రం ఆర్కే బీచ్‌కు చేరుకుని మిలాన్‌ విన్యాసాలను తిల‌కించిన అనంత‌రం స‌భ‌ను ఉద్దేశించి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రసంగిస్తారు. అనంత‌రం సిటీపరేడ్‌ను ప్రారంభించి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ దేశాల నౌకాదళ రక్షణ సిబ్బంది నిర్వహించే మార్చ్‌ పరేడ్‌ను తిలకిస్తారు.

తాజా వీడియోలు

Back to Top