తుపాను ప్ర‌భావిత ప్రాంతాల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏరియ‌ల్ స‌ర్వే

మూడు జిల్లాల్లో సీఎం వైయ‌స్ జగన్‌ ఏరియల్‌ సర్వే

అమరావతి: నివర్‌ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్ స‌ర్వే ద్వారా ప‌రిశీలిస్తున్నారు.  తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని ఏరియల్‌ సర్వే ద్వారా తెలుసుకుంటున్నారు.  అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్సార్‌, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరద ప్రభావంపై సమీక్ష నిర్వహిస్తారు.  సీఎం వెంట మంత్రులు సుచ‌రిత‌, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఉన్నారు.

ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో భేటీ కానున్న సీఎం జగన్‌
నివర్‌ తుపాన్‌ ఏరియల్‌ సర్వే అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో భేటీ కానున్నారు. తుఫాన్‌ ప్రభావం వల్ల జరిగిన నష్టాలపై చర్చించనున్నారు. అందులో భాగంగానే వివిధ శాఖల అధికారులు నివేదికలతో సహా ఇప్పటికే ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకున్నారు. సీఎంతో భేటీలో వరద నష్టాలను ప్రజాప్రతినిధులు సీఎం జగన్‌ దృష్టికి తేనున్నారు. కాగా, ఇప్పటికే మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన, చెవిరెడ్డి, బియ్యపు మధుసూధన్‌రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌ రెడ్డి, ఎంఎస్‌ బాబు, రామిరెడ్డి ప్రతాప్‌ రెడ్డి, ఆదిమూలం తదితరులు తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.

Back to Top