ఈనెల 5న ఆదోనికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

విద్యార్థుల‌కు `జ‌గ‌న‌న్న విద్యా కానుక‌` కిట్ల పంపిణీ

తాడేప‌ల్లి: ఈనెల 5వ తేదీన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదోనిలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆదోనిలోని మున్సిప‌ల్ క్రీడా మైదానం వేదిక‌గా విద్యార్థుల‌కు ‘జ‌గ‌న‌న్న విద్యా కానుక’ కిట్లను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పంపిణీ చేయ‌నున్నారు. ఈ మేర‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ కోటేశ్వరరావు, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, ముఖ్యమంత్రి  ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మనూరు జ‌య‌రాం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆదోనికి రావడం ఎంతో శుభసూచికమన్నారు. సీఎం రాకతో పశ్చిమ ప్రాంతమైన ఆదోని అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

హెలిప్యాడ్‌ ఏర్పాట్ల పరిశీలన 
ఆదోని పట్టణంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్ త‌లశిల రఘురాం, జిల్లా కలెక్టర్‌ కోటేశ్వరరావు, జేసీ రామసుందర్‌రెడ్డి పరిశీలించారు.  జిల్లా అధికారులకు తలశిల‌ రఘురాం పలు సూచనలు చేశారు. 

Back to Top