పొత్తూరి వెంకటేశ్వరరావు మృతికి సీఎం వైయస్‌ జగన్‌ సంతాపం

తాడేపల్లి: ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు(86) మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్యం కారణంగా ఈ ఉదయం ఆయన తన నివాసంలో కన్నుమూశారు. తెలుగు జర్నలిజంలో తనదైన ముద్ర వేసిన పొత్తూరి వెంకటేశ్వరరావు ఈనాడు, ఆంధ్రభూమి, వార్తా పత్రికల్లో పనిచేశారు. పత్రికారంగంలో ఐదు దశాబ్దాలకు పైగా సేవలు అందించారు. పొత్తూరి 1934 ఫిబ్రవరి 8వ తేదీన ఏపీలోని గుంటూరు జిల్లా పొత్తూరులో జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు. 2000లో నాటి పత్రికల మేటి విలువలు అనే పుస్తకాన్ని పొత్తురి రచించారు.
 

Back to Top