రేపు సీఎం వైయ‌స్‌ జగన్‌ విజయవాడ పర్యటన

క్రిస్మస్‌ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు(20.12.2022) విజ‌య‌వాడ న‌గ‌రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హాజ‌రు కానున్నారు. సాయంత్రం 5.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 5.30 గంటలకు విజయవాడ ఏ ప్లస్‌ కన్వెన్షన్‌కు చేరుకుంటారు. క్రిస్మస్‌ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమానికి హాజర‌వుతారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం 6 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Back to Top