తాడేపల్లిగూడెంలో అగ్నిప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి

బాణాసంచా పేలుడు ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం 

క్షతగాత్రులకు ఉత్తమ వైద్యం అందించాలని ఆదేశాలు

తాడేప‌ల్లి: తాడేపల్లిగూడెంలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాద ఘటనపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా ప్రాంతంలో తగిన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో గాయపడ్డవారికి మంచి వైద్యం అందించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున సహాయం అందించాలని, బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Back to Top