పేద‌లంద‌రికి వైద్యం అందాలి

అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలు

ఆరోగ్య కేంద్రాలు,108 సర్వీసుల పనితీరుపై ఆరా

వైద్య ఆరోగ్యశాఖపై ముగిసిన సీఎం సమీక్ష

అమరావతి: వైద్య ఆరోగ్యశాఖపై  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష సమావేశం ముగిసింది. సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘమైన సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య కేంద్రాలు,108 సర్వీసుల పనితీరుపై సీఎం ఆరా తీశారు. వైద్య విధాన పరిషత్,వైద్య విభాగాల పనితీరును తెలుసుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అన్ని విభాగాల అధికారులతో మాట్లాడారు.అన్ని వ్యవస్థలను సమూలంగా మార్పు తీసుకురావాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.ప్రధానంగా వ్యవస్థీకృతంగా ఉన్న లోపాలను సరిదిద్దాలన్నారు. రాష్ట్రంలో 108 వాహనాల నిర్వహణ గందరగోళంగా ఉన్న నేపథ్యంలో 108కు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని అధికారులతో చర్చించారు.

104 వాహనాలౖ నిర్వహణపై చర్చ జరిపారు.రాష్ట్రంలో మారుమూల గ్రామీణ,గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలు,మౌలిక వసతులు, సిబ్బంది కొరత వంటి అంశాలపై సీఎం అధికారులతో సమీక్షించారు.వైద్య రంగాన్ని మెరుగుపరిచి ప్రతి పేదవారికి కూడా వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఆరోగ్యశ్రీ పథకంలో తీసుకురావాల్సిన మార్పులపై కూడా ఈ సమీక్షలో దృష్టి సారించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, రిటైర్డ్‌ సీఎస్‌ అజయ్‌ కల్లాం, వైద్య శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  కాసేపట్లో జల వనరుల శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు.

వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి సహించను
వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి సహించనని అధికారులంతా బాధ్యతగా పనిచేయాలని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సూచించారు. 45 రోజుల్లో వైద్య రంగం ప్రక్షాళనకు నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు.ఎన్టీఆర్‌ వైద్యసేవను వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీగా అమలు చేయాలన్నారు.108,104లను సమర్థంగా నిర్వహించాలని తెలిపారు. వైయస్‌ఆర్‌ స్ఫూర్తికి అనుగుణంగా నిర్వహించాలన్నారు.ఎలుకలు కొరిక పిల్లలు చనిపోవడం,మొబైల్‌ ఫోన్లతో వైద్యం చేయడం వంటి సంఘటలనపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నడూ లేని సంఘటనలు గత ఐదేళ్లలో చూశామన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top