నేడు విశాఖకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి 

అమరావతి: నేడు ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  విశాఖ నగరానికి రానున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్   విశాఖలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌న‌తో పాటు తూర్పు నౌక‌ద‌ళం ఆధ్వ‌ర్యంలో జ‌రిగే కార్య‌క్ర‌మంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొనున్నారు.కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్, చీఫ్‌ ఆఫ్‌ నేవల్‌ స్టాఫ్‌తో వైయ‌స్‌ జగన్‌ భేటీ కానున్నారు. అనంతరం కల్వరి వద్ద ఉన్న అరిహంత్‌ డైనింగ్‌ హాల్‌లో విందులో పాల్గొంటారు.  తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో సమావేశం కోసం గురువారం హైదరాబాద్‌ వెళ్లిన సీఎం వైయ‌స్ జగన్ నేడు అక్కడినుంచే రాత్రి ఏడుగంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో భాగంగా సీఎం జగన్‌ రాత్రి 9 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి విమానంలో గన్నవరం చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి రోడ్డు మార్గాన తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top