సంక్రాంతి వేడుకలకు సీఎం వైయస్‌ జగన్‌  

అమరావతి: పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా గుడివాడలో నేడు నిర్వహించనున్న సంక్రాంతి వేడుకల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్‌ తాడేపల్లి నుంచి బయలుదేరుతారు. 3.45 గంటల నుంచి 4.45 వరకు గుడివాడలోని లింగవరం రోడ్ కే కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొంటారు. తిరిగి 5.35 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. 

Back to Top