రాజమహేంద్రవరం: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం రాజమహేంద్రవరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం నుంచి అర్ట్స్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గురజపులంక చేరుకుంటారు. గ్రామంలో వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం రామాలయపేటకు రోడ్డు మార్గానికి చేరుకుని, అక్కడ వరద బాధితులతో మాట్లాడతారు. అక్కడి నుంచి అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడతారు. అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో గురజపు లంక గ్రామానికి చేరుకుంటారు. తర్వాత హెలికాప్టర్‌లో తాడేపల్లికి వెళతారు.