గౌరవం చేతల్లోనూ.. 

కిందపడిపోతే స్వయంగా అందించిన సీఎం వైయ‌స్ జగన్‌

కృష్ణా: ఎదుటివారిని వాళ్ల వాళ్ల అర్హతను బట్టి గౌరవించడం, ప్రేమించడం ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న ప్రత్యేకత. మాటల్లోనే కాదు.. ఒక్కోసారి చేతల్లోనూ అది చూపిస్తుంటారాయన. అందుకోసం తన స్థాయిని పక్కనపెట్టి మరీ ఆయన ఓ మెట్టు కిందకు దిగుతుంటారు కూడా.  తాజాగా.. 
మంగళవారం ఉదయం విజయవాడలో జరిగిన 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆసక్తికర దృశ్యం ఒకటి చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం వైయ‌స్ జగన్‌ పలువురు పోలీసు సిబ్బందికి పోలీస్‌ మెడల్స్‌ ప్రదానం చేశారు. ఈ క్రమంలో ఓ పోలీస్‌ అధికారికి మెడల్‌ కిందపడిపోయింది. అది గమనించకుండా ఆయన వెళ్లిపోసాగాడు. అయితే.. సీఎం వైయ‌స్ జగన్‌ అది గమనించి ఆయన్ని ఆపారు. కిందకు దిగి ఆపి మరీ ఆ పోలీసుకు మెడల్‌ను తీసి మళ్లీ  ఆ అధికారి గుండెలకు అంటించారు. ప్రస్తుతం ఈ వీడియో జగనన్న అభిమానుల నుంచి విపరీతంగా వైరల్‌ అవుతోంది. 

Back to Top