నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయ‌స్‌ జగన్

 
పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా కలగంపూడి గ్రామంలో​ ఆదివారం పర్యటించారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు కుమార్తె డాక్టర్‌ సింధు వివాహ వేడుకలకు సీఎం వైయ‌స్ జగన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులను సీఎం ఆశీర్వదించారు.

సీఎం వైయ‌స్‌ జగన్‌కు మంత్రులు తానేటి వనిత, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ రవి ప్రకాష్ స్వాగతం పలికారు.

Back to Top