పేద కుటుంబాల‌కు ముఖ్య‌మంత్రి ఆప‌న్న హ‌స్తం

భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాల సందర్భంగా నలుగురికి రూ.ల‌క్ష చొప్పున ఆర్థిక స‌హాయం: జాయింట్  కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్.             

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ల‌బ్ధిదారుల ధ‌న్య‌వాదాలు

విజ‌యవాడ‌:  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి శనివారం స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నిర్వహించిన మైనార్టీల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. మైనారిటీ సోదరులను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత అవార్డుల ప్రదానోత్సవాన్ని  ముగించుకొని క్యాంపు ఆఫీసుకు తిరిగి వెళ్తున్న సమయంలో స్టేడియం వద్ద పలువురు తమ పిల్లల వైద్య అవసరాల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్‌) నుంచి ఆర్థిక సహాయం కోరుతూ ముఖ్యమంత్రికి వినతులు అందించగా.. త‌ప్ప‌కుండా ఆదుకుంటానని.. అధైర్య పడవద్దని ముఖ్య‌మంత్రి భ‌రోసా ఇచ్చారు. ఈ  నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లబ్ధిదారుల అవసరాలను తీర్చే నిమిత్తం శనివారం సాయంత్రం జిల్లా జాయింట్ కలెక్టర్  కార్యాలయంలో నలుగురికి లక్ష రూపాయలు చొప్పున చెక్కులను విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్, తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్, జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్ చేతులు మీదుగా అందజేశారు. 

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పలువురు అర్జీలు సమర్పించి.. తమ సమస్యలు చెప్పుకున్నారని తెలిపారు. సమస్యలు విన్న గౌరవ ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి వారికి ఆర్థిక సహాయం అందిస్తూ వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని తమకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా ఈరోజు నలుగురికి లక్ష రూపాయలు చొప్పున చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ తెలిపారు. వైద్య సేవ‌ల కోసం త‌మ‌కు స‌హాయం చేయాల‌ని అడిగిన వెంట‌నే భరోసా కల్పిస్తూ గౌర‌వ ముఖ్య‌మంత్రి చేసిన స‌హాయానికి ల‌బ్ధిదారులు మ‌నసారా ధ‌న్య‌వాదాలు తెలిపారు. 

 పేదల కష్టాలను అర్థం చేసుకొని సహాయం చేసేందుకు ఎప్పుడూ ముందుండే గొప్ప మనసున్న ముఖ్య‌మంత్రి మా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అంటూ  కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. తమ ప్రాంత ప్రజల్లో ఎవరికైనా కష్టం వస్తే ఆయా ప్రాంతాల స్థానిక శాసన సభ్యులు, నియోజక వర్గ ఇంఛార్జిలు తక్షణం స్పందించి సహాయం అందించేందుకు ముందుంటున్నారు. ఇందులో భాగంగానే విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ పలువురు సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సహాయం అందేలా చూశారు. కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ శాసన సభ్యులు మల్లాది విష్ణు,  విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, సబ్ కలెక్టర్ అదితి సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top