డైవర్ట్‌ పాలిటిక్స్‌ చేయడం బాబు, లోకేష్‌కు అలవాటు

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

వైయస్‌ఆర్‌సీపీ మద్దతుదారుల ఫోటోలతో వెబ్‌సైట్‌లో ఉంచాం

టీడీపీ ఫేక్‌ వెబ్‌సైట్‌తో ప్రజలను మోసం చేస్తోంది

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై నిమ్మగడ్డను పొగిడిన చంద్రబాబు..

మున్సిపల్‌ ఎన్నికల విషయంలో విమర్శలు చేయడం విచిత్రం

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ మీద టీడీపీ చిత్తశుద్ధి లేని దీక్షలు చేస్తోంది

లోకేష్‌ లేదా భరత్‌ను దీక్షకు ఎందుకు కూర్చోపెట్టలేదు

ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ వద్దన్న వాళ్లు విశాఖలో ఎలా అడుగుపెడతారు?

స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడేందుకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రధానికి లేఖలు రాస్తుంటే..

బాబు ఎన్నికల కమిషనర్‌కు లేఖలు రాస్తున్నారు

తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లు ఎప్పుడు డైవర్ట్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్రంపై టీడీపీ ఎందుకు పోరాటం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఫేక్‌ మాటలు, ఫేక్‌ న్యూస్‌ చంద్రబాబుకు బాగా అలవాటని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నిమ్మగడ్డను పొగిడిన చంద్రబాబు..మున్సిపల్‌ ఎన్నికలు వచ్చేసరికి విమర్శించడం విచిత్రంగా ఉందన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడేందుకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రధానికి లేఖలు రాస్తుంటే..చంద్రబాబు ఎన్నికల కమిషనర్‌ మీద లేఖలు రాస్తున్నారని ఎద్దేవా చేశారు. భవిష్యత్‌లో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకరని విమర్శించారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబుది ఫేక్‌ పార్టీ, ఆయన ఫేక్‌ నాయకుడు, ఆయనే ఫేక్‌ వెబ్‌ సైట్‌ క్రియేట్‌ చేసి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. మేం అఫీషియల్‌గా వైఎస్‌ఆర్‌సీపీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో మా పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌ల ఫొటోలు, వివరాలు పొందుపరిచాం. టీడీపీ ఫేక్‌ వెబ్‌సైట్‌తో ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. మీకు దమ్ముంటే..మీ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థుల వివరాలు వెల్లడించండి. చంద్రబాబు ఇన్నాళ్లు నమ్ముకున్న ఎన్నికల కమిషనర్‌పై ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రతి సారి ఎవరో ఒకరిపై నెపం నెట్టడం అలవాటు. ఈసారి చీకట్లో ఓట్లు లెక్కపెట్టారని సిగ్గులేని వాదన తెరపైకి తెచ్చారన్నారు.ఎప్పుడు ఏదో ఒక రకంగా ఓటమిని సరిదిద్దుకునే అలవాటు చంద్రబాబుకు లేదు. స్థానిక సంస్థల్లో భారీగా వైయస్‌ఆర్‌సీపీకి మెజారిటీ వచ్చింది కాబట్టి..ప్రజలను డైవర్ట్‌ చేయడానికి చంద్రబాబు, ఆయన కుమారుడు కొత్తగా ఎత్తులు వేస్తున్నారు. 
నిన్నటి దాకా నిమ్మగడ్డను ఇంద్రుడు, చంద్రుడు అని పొగిడారు. ఇవాళ మున్సిపల్‌ ఎన్నికలు ఎక్కడి నుంచి ఆగాయో..అక్కడి నుంచి మొదలుపెడుతున్నట్లు ప్రకటన చేయడంతో టీడీపీ మరోరకంగా మాట్లాడుతోంది. మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా టీడీపీకి ఉనికి ఉండదని గ్రహించి, ఎన్నికల కమిషనర్‌పై విమర్శలు చేస్తున్నారు. ఓటమిపై చంద్రబాబు సిగ్గులేని వాదనలు వినిపిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాధరణ కోల్పోతున్నామన్న ఆలోచన ఎప్పుడు చేయడం లేదని ధ్వజమెత్తారు. ఆయనకు ఎల్లో మీడియా తానా అంటే తందానా అంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై నిమ్మగడ్డను పొగిడిన చంద్రబాబు..మున్సిపల్‌ ఎన్నికల విషయంలో విమర్శలు చేయడం విచిత్రంగా ఉందన్నారు.
నామినేషన్లు వేస్తేనే విజయంగా భావించారన్నారు. రాబోయే ఎన్నికల్లో అభ్యర్థి నిలబడితేనే వార్త అన్నట్లుగా ఎల్లో మీడియా కథనాలు ఉన్నాయి. ఇలాంటి వార్తలు రాసుకొని సంబరపడుతున్నారు. 
విశాఖలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేస్తున్నారు. కరోనా వచ్చిన వ్యక్తికి నీరసంగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తే దానిపై రాజకీయం చేస్తున్నారు. మానవత్వదృక్పథంతో ఆసుపత్రికి తరలించామన్నారు. ఆ దీక్షలో ఎందుకు నారా లోకేష్‌ కూర్చోలేదని ప్రశ్నించారు. మూర్తి మనవడు దీక్ష చేయవచ్చు కదా అని నిలదీశారు. ఈ రోజు అమరావతికి శాసన రాజధాని చేయాలని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతించారు. కానీ చంద్రబాబు విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ రాజధాని వద్దని ఉద్యమం చేశారు. ఉత్తరాంధ్రలో రాజధాని వద్దన్న చంద్రబాబు ఇవాళ విశాఖ వెళ్లే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై టీడీపీ చిత్తశుద్ధి లేని దీక్షలు చేస్తుందన్నారు.  2014లోనే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నలు జరిగితే..ఆ రోజు చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. చంద్రబాబు తన అడ్డమైన సొమ్ముతో హెరిటేజ్‌ సంస్థను పెట్టుకున్నారు. ఆ సంస్థను మేం అమ్ముకోగలమా? . విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రత్యామ్నయ మార్గాలు కూడా సూచించారు. చంద్రబాబు ఇవాళ ప్రధాని మోదీకి ఎందుకు లేఖలు రాయడం లేదని నిలదీశారు. తనపై ఉన్న కేసులకు భయపడి చంద్రబాబు ప్రధానికి లేఖలు రాయడం లేదు. 
వైయస్‌ఆర్‌సీపీ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఈ నెల 20న మా పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి పాదయాత్ర చేయబోతున్నారని చెప్పారు. చంద్రబాబుకు ఒక క్రెడిబులిటీ లేదన్నారు. ఆయన మాటపై నిలబడరని విమర్శించారు. మంగళగిరిలో గెలవలేని నారా లోకేష్, స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌లను గెలిపించుకోలేకపోయారు. ఇలాంటి వ్యక్తి ప్రభుత్వం గాడిదలు కాస్తుందా అని మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. 2004లో 52 సంస్థలను చంద్రబాబు ప్రైవేటీకరణ చేశారని గుర్తు చేశారు. నష్టాల్లో ఉందని ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని చంద్రబాబు ప్రయత్నించారన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ..మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిందని తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో ఇప్పటికే మా పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రులను కలిశారు. ప్రధాని అపాయింట్‌మెంట్‌ కూడా కోరారని, ఇప్పటికే లేఖ రాశారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రధానికి ఎందుకు లేఖలు రాయడం లేదని గడికోట శ్రీకాంత్‌రెడ్డి నిలదీశారు. 
 

Back to Top