ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌ను ప‌రామ‌ర్శించిన ముఖ్య‌మంత్రి

తాడేప‌ల్లి: పర్చూరు నియో­జకవర్గ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆమంచి కృష్ణమో­హన్‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. సోమవారం రాత్రి ఆక్వా నర్సరీలో వాకింగ్‌ చేస్తుండగా ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌ పాముకాటుకు గుర‌య్యారు. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం చీరాల ఏరియా ఆస్ప‌త్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ప్రాణాపాయం నుంచి కాపాడారు. వైద్యుల సూచన మేర‌కు కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం విజయ­వాడలోని మణిపాల్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పూర్త‌యిన అనంత‌రం హాస్పిటల్‌ నుంచి ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌ డిశ్చార్జి అయ్యారు. 

తాజా వీడియోలు

Back to Top