రేపు ఒడిశాకు సీఎం వైయస్‌ జగన్‌ 

పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డిశాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరు

అక్కడి నుంచి నేరుగా ఒడిశా సీఎం నివాసానికి

ఇరు రాష్ట్రాల పెండింగ్‌ అంశాలపై చర్చించనున్న ముఖ్యమంత్రులు

తాడేపల్లి: రేపు (09–11–2021) శ్రీకాకుళం జిల్లా పాతపట్నంతో పాటు ఒడిశా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 01.15 గంటలకు పాతపట్నం చేరుకుంటారు. పాత‌ప‌ట్నంలో వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రెడ్డిశాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. శ్రీకాకుళం పర్యటన అనంతరం విశాఖ ఎయిర్‌పోర్ట్‌ చేరుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ బయలుదేరనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నివాసానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చేరుకుంటారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ పెండింగ్‌ అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. రాత్రి 7 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి సీఎం వైయస్‌ జగన్‌ చేరుకుంటారు. 
 

తాజా ఫోటోలు

Back to Top