హ‌ర్యానా సీఎం ఖ‌ట్ట‌ర్‌తో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ భేటీ

విశాఖ‌ప‌ట్నం: హ‌ర్యానా సీఎం మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌తో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మ‌ర్యాద‌పూర్వ‌కంగా భేటీ అయ్యారు. విశాఖలోని రుషికొండ పెమ వెల్‌నెస్‌ రిసార్ట్‌లో ఇరువురు ముఖ్యమంత్రుల స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా హ‌ర్యానా సీఎం ఖట్ట‌ర్‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌నంగా స‌త్క‌రించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వెంట డిప్యూటీ సీఎం బూడి ముత్యాల‌నాయుడు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్‌, మాజీ మంత్రి అవంతి శ్రీ‌నివాస్ ఉన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top