విశాఖ బయల్దేరిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక విమానంలో విశాఖ బయల్దేరారు. విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ వల్ల అస్వస్థతకు గురైన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించిన సీఎం వైయస్‌ జగన్‌.. విశాఖకు వెళ్లి స్వయంగా వైద్య, సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. అదే విధంగా అస్వస్థకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను, మరణించిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. అనంతరం అక్కడి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. 
 

Back to Top