అవ‌నిగ‌డ్డ‌కు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

కృష్ణా: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణా జిల్లా అవనిగడ్డ చేరుకున్నారు. తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి బ‌య‌ల్దేరిన సీఎం.. కొద్దిసేప‌టి క్రిత‌మే అవ‌నిగ‌డ్డ‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా హెలిప్యాడ్ వ‌ద్ద మంత్రులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, రోజా, జోగి ర‌మేష్‌, ఎమ్మెల్యే సింహాద్రి ర‌మేష్‌, అధికారులు, వైయ‌స్ఆర్ సీపీ సీనియ‌ర్ నేత‌లు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. 22 ఏ (1) కింద ఉన్న నిషేదిత భూముల సమస్యకు పరిష్కారం లభించింది. ఈ నేపథ్యంలో రైతుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ క్లియరెన్స్‌ పత్రాలను అందజేయనున్నారు. అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొని ప్రసంగించ‌నున్నారు. అనంత‌రం  నిషేదిత భూముల జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్‌ పత్రాలను రైతులకు అందజేస్తారు.

తాజా వీడియోలు

Back to Top