రామోజీరావుది నల్ల సిరా కాదు.. ఎల్లో సిరా  

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌

సచివాలయ వ్యవస్థతో విప్లవాత్మక మార్పులు

టీడీపీ కరపత్రికగా ఈనాడు కథనాలు

 తాడేపల్లి:  రామోజీరావుది నల్ల సిరా కాదు.. ఎల్లో సిరా అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ  మండిప‌డ్డారు. ఈనాడు, రామోజీరావు తప్పుడు కథనాలపై మంత్రి  ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కరపత్రికగా ఈనాడు కథనాలు రాస్తోంది.. రామోజీరావు ప్రతిపక్షం పాత్ర పోషిస్తున్నారని అన్నారు.  తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి గురువారం మీడియాతో మాట్లాడారు.  
‘ప్రభుత్వంపై రామోజీరావు విషపు రాతలు రాస్తున్నారు. రామోజీరావుది నల్ల సిరా కాదు.. ఎల్లో సిరా. జర్నలిస్టుల విలువలను దిగజార్చొద్దు. రామోజీరావు ప్రతిపక్షం పాత్ర పోషిస్తున్నారు. వాలంటీర్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు పథకాలు అందిస్తున్నది వాలంటీర్లే. సచివాలయ వ్యవస్థతో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాము. వాలంటీర్లపై తప్పుడు రాతలు రాయొద్దు. వాలంటీర్లు ఉద్యోగులు కాదు.. సేవకులు. చంద్రబాబు హయంలో పథకాల గురించి వాస్తవాలు రాసారా?. టీడీపీ కరపత్రికగా ఈనాడు కథనాలు రాస్తోంద‌ని మంత్రి మండిప‌డ్డారు. 

పచ్చ గ్యాంగ్ తట్టుకోలేకపోతుంది*
- ఈనాడు పత్రిక వాలంటీర్‌ వ్యవస్థపై విషపు రాతలు రాస్తోంది. వాలంటీర్‌ వ్యవస్థ రాష్ట్రానికే కాదు దేశానికే ఆదర్శంగా పనిచేస్తోంది. 
- ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాన్ని సకాలంలో ప్రజలకు అందించేలా నమ్మకాన్ని కలిగించిన ఈ వ్యవస్థను చూసి పచ్చ గ్యాంగ్‌ తట్టుకోలేకపోతోంది. అందుకే వాలంటీర్‌ వ్యవస్థపై ఇలాంటి విషపు రాతలు రాస్తున్నారు.  ప్రభుత్వంలో పనిచేస్తున్న వాలంటీర్లు ప్రజల పట్ల బాధ్యతతో, ప్రభుత్వం పట్ల విశ్వాసం, నమ్మకంతో పనిచేస్తున్నారు. ఈ వ్యవస్థను రూపకల్పన చేసిన నాయకుడిపై అభిమానంతో బాధ్యతగా సేవలు అందిస్తుంటే ఈనాడు రామోజీరావుకు నచ్చడం లేదు. వాలంటీర్‌ వ్యవస్థ కూడా మీరు చెప్పినట్లు నడవాలని కోరుకుంటున్నట్లున్నారు. 
- రామోజీ, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు వంటి వారు ఈ వ్యవస్థను వక్రకోణంలో చూపిస్తున్నారు. ఈ వ్యవస్థ ఎలా పనిచేయాలో వీళ్లు చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వం నిర్ధేశించనట్లు ఆ వ్యవస్థ పనిచేస్తుంది. 

*వాలంటీర్లు అంటే రామోజీకి ఎందుకంత భయం..?*
- జన్మభూమి కమిటీల మాదిరిగానే వాలంటీర్ల వ్యవస్థ కూడా ఉంటుందని వారంతా భావించినట్టు ఉన్నారు. దానికి భిన్నంగా సేవే పరమావధిగా పనిచేస్తుండటంతో తట్టుకోలేకపోతున్నారు. 
- ఆ రోజు జన్మభూమి కమిటీల అకృత్యాలను ఏ రోజూ ఈ పచ్చ మీడియా  ప్రశ్నించలేదు... వారి పత్రికల్లో రాయలేదు. వాలంటీర్‌ వ్యవస్థకు, జన్మభూమి కమిటీలకు చాలా వ్యత్యాసం ఉందని రామోజీ తెలుసుకోవాలి
- టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు ప్రజల్ని దోపిడీ చేసి జలగల్లా పీక్కుతిన్నాయి. కానీ వాలంటీర్లు సేవా దృక్పధంతో పనిచేస్తున్నారు. ప్రజల అవసరాలను తెలుసుకుని ఇంటి ముందుకే అందిస్తున్న సర్వీసులను పచ్చ మీడియా కించపరుస్తోంది.  వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మార్చాలనుకోవడం దురదృష్టకరం, దుర్మార్గం. 
- కేవలం నామమాత్రపు పారితోషకంతో గొప్పగా సర్వీసు అందిస్తున్న వాలంటీర్‌ వ్యవస్థపై విషం చిమ్మడం దురదృష్టకరం. ఒక పెత్తందారి వ్యవస్థ అధికారాన్ని చేతిలో ఉంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తోంది. 
- రామోజీరావు ఆ రోజు ఎన్టీఆర్‌ తన చేతిలో లేడని చంద్రబాబును ఎంచుకున్నాడు. రేపు చంద్రబాబు తన చేతిలో లేకపోతే పయ్యావుల కేశవ్‌నో, మరొకర్నో ఎంచుకుంటాడు.
- ఆయన దగ్గర కలం ఉందని, తాను చెప్పిందే ప్రజలు నమ్ముతారని, తాను చెప్పిందే వాస్తవాలని ప్రజలు నమ్ముతున్నారని రామోజీ భ్రమల్లో ఉన్నారు. వాలంటీర్‌ వ్యవస్థ పట్ల రామోజీకి ఒక భయం ఏర్పడింది

*ఈనాడు "చంద్రనాడు"గా మారింది*
- రామోజీ ఎజెండా టీడీపీకి, చంద్రబాబుకు ఎలా మేలు చేయాలన్నదే.  ఈనాడు ఎప్పుడో టీడీపీ పత్రికగా మారిపోయింది. ఈనాడు పత్రిక చంద్రనాడుగా మారిపోయిందా..? మార్చుకున్నారా..?
చంద్రబాబు ఆలోచనలకు మీరు వంతపాడటం కోసం వ్యవస్థలను కించపరచడం మంచిది కాదు. 
- ఆరోజు జన్మభూమి కమిటీలు చేసిన అకృత్యాలు ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేదు. 
- పింఛన్లు కావాలంటే వారికి మూడు నెలల పింఛన్‌ లంచంగా ఇవ్వాల్సి వచ్చేది. 
- ఇల్లు మంజూరు కావాలంటే రూ.20 వేలు లంచం. లోను మంజూరు కావాలంటే రూ.10 వేలు లంచం. 
- మరుగుదొడ్లు కావాలంటే 1500 లంచం ఇవ్వాలి.
- లంచాల ద్వారా పేదవాడ్ని దోపిడీ చేస్తుంటే ఆనాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్లిన విషయం మీరెందుకు రాయలేదు
- అధికార పార్టీయే ప్రభుత్వం...ప్రభుత్వమే అధికార పార్టీ అని ఆనాడు కోర్టు తీర్పునిస్తే చంకలు గుద్దుకున్నది మీరు కదా...
- ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే అధికార పార్టీ నిర్ణయం అన్నప్పుడు ఇప్పుడెందుకు ఇలాంటి రోత రాతలు రామోజీ..?

*మా హయాంలో లంచం అనే మాటే లేదు*
- మా పరిపాలనలో ఎక్కడైనా లంచం అనే మాట చూపించగలరా..?. సచివాలయ వ్యవస్థ ద్వారా 700 కు పైగా సేవలను అమలు చేస్తుంటే దానిపైనా విషపు రాతలు రాస్తున్నాడు రామోజీ. 
నీ మనసు చంద్రబాబుతో...చంద్రబాబు మనసు నీతో పెట్టుకుని ఈ ప్రభుత్వానికి అప్రదిష్ట తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నావు. రామోజీరావు ఇకనైనా మారాలి...ప్రజలకు జరిగే మంచిని చూడు. లేకుంటే బాబుతో పాటు నీకూ ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. 

*ఎల్లో సిరాతో రామోజీ విషపు రాతలు*
- జర్నలిజం విలువలను మంటగలిపి.. ఎల్లో సిరాతో ప్రభుత్వంపైనా, వ్యవస్థలపైనా, ముఖ్యమంత్రి గారిపైనా..  నిత్యం విషపు రాతలు రాసి రామోజీరావు దిగజారుడు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడు
- ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన చంద్రబాబు పూర్తిగా విఫలం చెందాడు. ప్రతిపక్షపాత్ర పోషించాల్సిన మీడియా.. ప్రజావసరాలు తీరుస్తున్న ఈ ప్రభుత్వంపై విషపు రాతలు రాయడం తగదని తెలుసుకోండి. మీరు కల్పించే భ్రమలను ప్రజలు నమ్ముతారు అనుకుంటే పొరపాటే. 
- ఎన్టీఆర్‌ వెన్నుపోటులో కర్త, కర్మ, క్రియ రామోజీరావే. ఆనాడు ఎన్టీఆర్‌ గురించి ఏమి రాశారు..? ఇప్పుడు ఏం రాస్తున్నారో చూసుకోండి. 
- ప్రజల దృష్టిని మరల్చాలని మీరు చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలి

*1వ తేదీన, తెల్లవారకముందే మీ హయాంలో ఏనాడైనా పింఛన్‌ ఇచ్చారా..?*
- ఏ రోజైనా ఒకటో తేదీనే, తెల్లవారకమునుపే, మీరు పింఛన్లు పంపిణీ చేశారా..? ఈరోజు ఠంచన్ గా 1వ తేదీనే, తెల్లవారక మునుపే వాలంటీర్లు గడప వద్దకే వచ్చి పింఛన్‌ అందిస్తున్నారు. ఇటువంటి గొప్ప పాలనను మీరు ఏ రోజైనా మెచ్చుకున్నారా..?. ప్రజలకు మేలు జరుగుతుందని ఒక్క ముక్క అన్నా రాశారా..
- అలా ఇంటికి తీసుకెళ్లి ఇస్తున్న వాలంటీర్‌ వ్యవస్థను దేశమంతా మెచ్చుకుంటే దాన్ని రాయడానికి రామోజీకి చేతులు రాలేదు
- వాలంటీర్‌ వ్యవస్థ బాధ్యత కలిగిన ప్రజా సేవ కోసం నియమించిన వ్యవస్థ. ఎక్కడా ఎంపిక చేసే అధికారం వారికి ఇవ్వలేదు. అర్హత ఉంటే దాన్ని ప్రభుత్వానికి నివేదిస్తారు మాత్రమే. 
- అదే టీడీపీ హయాంలో.. 2014 సెప్టెంబర్‌ 15న పంచాయతీరాజ్‌ నుంచి జీవో నంబర్‌ 135లో సెలక్షన్‌ కమిటీ ద్వారా అన్ని అధికారాలు జన్మభూమి కమిటీలకు కట్టబెట్టారు.
- చంద్రబాబునాయుడు ఇళ్ళ మంజూరు కోసం 2017లో జీవో నంబర్‌ 36 ఇచ్చాడు...దీనిలోనూ జన్మభూమి కమిటీలకు అధికారాలు ఇచ్చాడు.  ఈ కమిటీలు లంచాలతో వ్యవస్థను భ్రష్టు పట్టించాయి.
- మా వాలంటీర్లు కులం, మతం, పార్టీ అని చూడకుండా అందరికీ పథకాలు అందిస్తున్న వైనం మీకు కనిపించడం లేదు
- తెలుగుదేశం పార్టీ అడ్రస్‌ గల్లంతు అవుతుందని గుర్తించి ఇలాంటి రాతలు రాస్తున్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ వ్యవస్థను మెచ్చుకుంటున్నాయి...
ఎక్కడా లంచాలకు ఆస్కారం లేకుండా జగన్మోహన్‌రెడ్డి గారు దాదాపు 2 లక్షల కోట్లు డీబీటీ ద్వారా పంచారు. దాన్ని ఎప్పుడైనా రామోజీరావు ప్రశంసించాడా..?

*చంద్రబాబు వాలంటీర్లు విమర్శలా..!*
- చంద్రబాబుకు వాలంటీర్లుగా పనిచేస్తున్న రామోజీ, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడులు మా వాలంటీర్ల గురించి మాట్లాడటం సిగ్గుచేటు. 
- కానీ మా వాలంటీర్లు మీలా కాదు...సేవే పరమావధిగా పనిచేస్తున్నారు.  50 ఇళ్లకు ఒక బంధువు వాలంటీర్‌ అని తెలుసుకోండి.  జగన్‌ గారిపట్ల అభిమానంతోనే వాలంటీర్లు సేవా ధృక్పథంతో పనిచేస్తున్నారు. వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదు...సేవకులు. వారు ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి పట్ల అభిమానం చూపితే తట్టుకోలేని వ్యక్తులే ఇలాంటి రాతలు రాస్తున్నారు. జగన్మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వం వల్ల వాలంటీర్లకు ఒక గౌరవం దక్కింది.
- ప్రజలకు మంచి జరిగితే మీరు సహించలేరు..ప్రజలు ఆకలితో ఉంటేనే తన అవసరాలు తీరతాయని, తనకు అధికారం వస్తుందన్నది చంద్రబాబు నైజం
- దాన్ని అమలు చేయడమే ఎల్లో మీడియాగా మీ లక్ష్యం. జన్మభూమి కమిటీలకు వత్తాసు పలికిన రామోజీ వాలంటీర్‌ వ్యవస్థపై రాస్తున్న విషపు రాతలను ఖండిస్తున్నాము.
- చంద్రబాబు చేసిన తప్పిదాలను మభ్యపెట్టి, ఎలాగైనా అతన్ని అధికారంలోకి తీసుకురావాలని మీరు చేసే ప్రయత్నం ఫలించదు
- ఎన్నికల ముందు చంద్రబాబు వెయ్యి రూపాయల పింఛన్‌ను రెండు వేలు చేసి రెండు నెలలు ఇచ్చి మోసం చేస్తే.. దాన్నెప్పుడైనా రామోజీ రాశాడా..?
- రైతులకు చంద్రబాబు ఎగనామం పెట్టిన రుణమాఫీ గురించి రాశావా రామోజీ..?
- ఈనాడు పత్రిక తెలుగుదేశం పార్టీ గజిట్‌ పేపర్‌గా మారిపోయింది. 

*ఆ నమ్మకమే ఉంటే పొత్తుల కోసం ఎందుకు ఆరాటం..?*
- చంద్రబాబుకి ముఖ్యమంత్రి అవుతాననే ధైర్యం ఉంటే..  పవన్‌ కళ్యాణ్‌ తోనో, మరో పార్టీలతోనో పొత్తుల కోసం వెంపర్లాడే వాడే కాదు
- వీరంతా కలిసి పేదవాడ్ని పేదవాడిగానే ఉంచుదాం... మనమంతా కలిసి సంక్షేమ- అభివృద్ధి ప్రభుత్వాన్ని పడగొడదాం.. అని అంటున్నారు. వారి మాటల్లోనే జగన్‌ గారిని ఓడించలేము అనేది స్పష్టంగా కన్పిస్తోంది. 
- చంద్రబాబు 2011 నుంచి జగన్‌గారి ఫోబియా పట్టుకుంది..రాష్ట్రంలో ఏది జరిగినా జగన్‌ గారికి ఆపాదిస్తాడు. రెండు వేల రూపాయల నోట్లు జగన్‌గారి ఇంట్లో ఉన్నట్లు ఈయనేమన్నా గోడదూకి చూశాడా..?
- కళ్లెదురుగా కన్పిస్తున్న సత్యాన్ని కూడా అసత్యం అని చెప్పి నమ్మించగల సమర్థులు చంద్రబాబు, ఎల్లో మీడియా. 
-చంద్రబాబుకి సంక్షేమం తెలియదు. సన్‌... క్షేమమే తెలుసు.. అందుకే మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. 

Back to Top