చంద్రబాబు ఆస్తి రూ.20 వేల కోట్లా?

మంత్రి ఆర్కే రోజా 

 లోకేష్ ఢిల్లీలో మోడీ, అమిత్ షా కాళ్లు పట్టుకోవడానికి తిరుగుతున్నారు

 తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని రాష్ట్ర‌ప‌తిని కోరారు

ఆరు నెలల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని లోకేష్ చెప్తుంటే అందరూ నవ్వుతున్నారు

సీఐడీ మెమోలో లోకేష్‌ పేరు రాశారని గుర్తు చేసుకోవాలి

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి మంచి కృషి జరుగుతోంది

పెట్టుబడులు ఆకర్షించేలా 2020-2025 పాలసీ అమలు చేస్తున్నాం :  మంత్రి రోజా

విజ‌య‌వాడ‌: హెరిటేజ్ లో 2 శాతం షేర్లు అమ్మితేనే త‌న వాటా రూ. 400 కోట్లు వస్తాయని భువనేశ్వరి చెప్తున్నారు.. అంటే చంద్రబాబు ఆస్తి 20 వేల కోట్లా? అని మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. విజయవాడలోని తుమ్మలపల్లిలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని ప్ర‌సంగించారు. లోకేష్ రాష్ట్రపతిని కలిసి తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని కోరారు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం లోకేష్ రాష్ట్రపతిని కలిసిన దాఖలాలు లేవు అంటూ ఎద్దేవా చేశారు. లోకేష్ ఢిల్లీలో మోడీ, అమిత్ షా కాళ్లు పట్టుకోవడానికి తిరుగుతున్నారు.. కానీ, అడ్డంగా దొరికిన చంద్రబాబును కాపాడేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు.. ప్రధాని మోడీ , అమిత్ షా కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు స్కిల్ డెవెలప్‌మెంట్ సహా అమరావతి, ఫైబర్ నెట్ వంటి అనేక స్కాంలు చేశారని ఆరోపించారు మంత్రి రోజా.. రోడ్డు వేయకముందే ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్‌మెంట్ పేరుతో దోచుకున్నారు.. ఆరు నెలల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని లోకేష్ చెప్తుంటే అందరూ నవ్వుతున్నారు.. స్కాంలలో ఇరుక్కుని లోకేష్ ఢిల్లీ పారిపోయాడు అని విమర్శించారు. కాళ్ల నుండి కళ్ల వరకూ భయంతో లోకేష్‌ వణికిపోతున్నాడు.. ఎర్రబుక్ లో రాసుకుంటానని బెదిరిస్తున్న లోకేష్.. సీఐడీ మెమోలో ఆయన పేరు రాశారని గుర్తు చేసుకోవాలన్నారు. 

కర్జూర నాయుడు చంద్రబాబుకు, ఆయన తమ్ముడికి చెరో ఎకరం ఇచ్చారు.. అక్కడి నుండి లక్షల కోట్లకు చంద్రబాబు ఆస్తి ఎలా పెరిగింది? అని నిలదీశారు మంత్రి రోజా.. హైదరాబాద్ లో చంద్రబాబు ఇల్లు రూ.600 కోట్లుగా పేర్కొన్న ఆమె.. భువనేశ్వరి, లోకేష్ 118 కోట్ల రూపాయల నోటీసులకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రపంచ దేశాల్లోని తెలుగువారంతా ఈ స్కాంలను తెల్సుకోవాలని సూచించారు. ఇక, భువనేశ్వరి, బ్రహ్మణి అబద్ధాలు చెప్తుంటే ఎన్టీఆర్ కూతురు, మనవరాలు అనే గౌరవం కూడా పోతుందన్నారు. చంద్రబాబు టీమ్ వర్క్ గా కుటుంబసభ్యులంతా దోపిడీలో భాగస్వామ్యం అయినట్టు ప్రజలకు స్పష్టమైందని  మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు

సింగిల్‌ విండో పద్ధతుల్లో అనుమతులు
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి మంచి కృషి జరుగుతోంది.. పెట్టుబడిదారులకు సింగిల్‌ విండో పద్ధతుల్లో అనుమతులు ఇస్తున్నట్టు మంత్రి ఆర్కే రోజా తెలిపారు. పర్యాటకులకు విశేష సేవలు అందించిన హోటల్స్ కు అవార్డులు అందించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యాటక రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి.. ప్రకృతి అందాలు, సాంస్కృతిక వైభవం కలిగిన ప్రాంతం మన దేశం అన్నారు. దేశంలో అత్యధిక పర్యాటక అభివృద్ధి గల ప్రాంతంగా ఏపీ మూడో స్థానంలో ఉందని తెలిపారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు ఆకర్షించేలా 2020-2025 పాలసీ అమలు చేస్తున్నాం అని వెల్లడించారు. గండికోట, తిరుపతి, విశాఖపట్నంలో ఒబేరాయ్ హోటల్ నిర్మాణానికి సీఎం వైయ‌స్‌ జగన్ శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. పీపీపీ పద్దతిలో 14 ప్రాజెక్టులు నిర్మాణం చేస్తున్నాం.. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తోందని వెల్లడించారు. సింగిల్ విండో పద్ధతుల్లో పెట్టుబడి దారులకు అనుమతి ఇస్తున్నామని.. 48 టూరిజం హోటల్స్ లో ఫైవ్ స్టార్ హోటల్స్ ఉండే సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. పర్యాటక స్థలాలు కబ్జా కాకుండా పీపీపీ పద్దతిలో అభివృద్ధి చేస్తాం.. ఏపీ టూరిజం ఫోరమ్ ను ఏర్పాటు చేసి సంస్థాగతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి ఆర్కే రోజా ప్ర‌క‌టించారు.

తాజా వీడియోలు

Back to Top