నెల్లూరు:చంద్రబాబు సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి «ధ్వజమెత్తారు. తొమ్మిది నెలల్లో తీసుకోవాల్సిన అప్పులను ఒక నెలలోనే తీసుకున్నారన్నారు.పుట్టబోయే బిడ్డ మీద కూడా రూ.40వేలు అప్పు ఉందన్నారు.ప్రతి నెలా ప్రభుత్వం ఓవర్‌డ్రాప్ట్ కింద నిధులను తీసుకుందన్నారు.26,022 కోట్ల రూపాయలను ఓవర్‌డ్రాప్ట్ కింద తీసుకుందన్నారు.గత రెండు నెలలుగా జౌట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వడం లేదన్నారు. చేసిన అప్పులతో తమకు చెందిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తోందన్నారు.ఆర్థికంగా రాష్ట్రం పతనం కావడానికి బాబు విధానాలే కారణమన్నారు.ప్రభుత్వ ఆర్థిక శాఖను ఒక ప్రైవేట్ నిర్వహించడం దారుణమన్నారు.సీఎఫ్ఎంఎస్ను ఏర్పాటు చేసి ఎన్ఆర్ఐ కృష్ణదేవరాయలు చేతిలో పెట్టారన్నారు.ఆర్థిక శాఖలో అవకతవకలను ప్రశ్నించిన సీఎస్‌ను విమర్శించడం సరికాదన్నారు.ఆర్థిక శాఖలో అవకతవకలు చూసి ఐఏఎస్ అధికారులు సెలవుపై వెళ్ళిపోతున్నారన్నారు.ఆర్థిక శాఖ తీరుపై పూర్థిసాయిలో విచారణ చేయాలన్నారు.