చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు

టీడీపీ ప్రభుత్వం పోలీసులను పావులుగా వాడుకుంటోంది

చంద్రబాబు పాలనలో రైతులకు అన్యాయం

రైతు ప్రసాద్‌కు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుంది

వైయస్‌ఆర్‌సీపీ నేత డా.శ్రీదేవి

హైదరాబాద్‌: టీడీపీ ప్రభుత్వం పోలీసులను పావులుగా వాడుకుంటుందని వైయస్‌ఆర్‌సీపీ నేత డా.శ్రీదేవి మండిపడ్డారు.హైదరాబాద్‌లోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.ల్యాండ్‌ పూలింగ్‌కు ఇవ్వని రైతును వేధించడం సమంజసం కాదన్నారు. చంద్రబాబు ఇంటినైతే రోడ్డు విస్తరణకు ఇస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో సామాన్యులకు,రైతులకు న్యాయం జరగడంలేదన్నారు.ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో సామాన్య రైతులపై బెదిరింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.రైతులు ల్యాండ్‌లు ఇవ్వకపోవడంతో అరటితోటలను తగలబెట్టించారన్నారు.

శాఖమూరిలో అంబేద్కర్‌ విగ్రహం పెట్టి అంబేద్కర్‌ స్మృతివనాన్ని నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారని, ఈ ప్రాంతాన్ని  పరిశీలించడానికి వైయస్‌ఆర్‌సీపీ దళిత నేత మేరుగ నాగార్జున వెళ్ళితే అరెస్ట్‌చేశారని గుర్తుచేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన భూములను సర్వే చేసి సమానమైన ప్యాకేజీలు ఇవ్వాలని  రాజధాని దళితులు అడిగితే వారిని దీక్షను కూడా భగ్నం చేశారన్నారు.పూలింగ్‌కు భూమి ఇవ్వని రైతు మీరా ప్రసాద్‌ను కొట్టి నరకయాతనకు గురిచేశారన్నారు.చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు.

రైతు మీరా ప్రసాద్‌ ల్యాండ్‌ పూలింగ్‌కు ఇవ్వనని కోర్టు స్టే ఆర్డర్‌ కూడా తెచ్చుకున్నారని, పోలీస్‌ యంత్రాంగం,సిఆర్‌డిఏ,రెవెన్యూ అధికారులు కోర్టు ఆర్డర్లను సైతం ధిక్కరిస్తారా అని ప్రశ్నించారు.పౌరుల ప్రాథమిక హక్కులను హరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.చట్టం ప్రకారం ల్యాండ్‌ పూలింగ్‌కు భూములను తీసుకోవాలన్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో రైతులతో చర్చించి,రైతులకు కావలసిన ఫ్యాకేజీ ఇచ్చి రోడ్డు వేసుకోవాలన్నారు. ఒక నియంతలాగా,అరాచకంగా దౌర్జన్యాలకు పాల్పడకూడదని దుయ్యబట్టారు.రాజధాని రైతు ప్రసాద్‌కు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందన్నారు.  చంద్రబాబు నియంత పాలన ఎంతో కాలం సాగదన్నారు.
 

Back to Top