అవినీతిలో ప్రథమస్థానం చంద్రబాబు ఘనతే 

చంద్రబాబు సమీక్షలు దేని కోసం..?

అవగాహన లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు

అవినీతి ఆధారాలు తుడిచిపెట్టడానికే సమీక్షలు

దళారీ వ్యవస్థను ప్రోత్సహించి రైతుల నడ్డివిడిచారు

వైయస్‌ఆర్‌సీపీ నేత కాకాణి గోవర్ధన్‌ రెడ్డి

హైదరాబాద్‌: చంద్రబాబు చేస్తున్న సమీక్షలు దేనికోసం అని వైయస్‌ఆర్‌సీపీ నేత కాకాణి గోవర్ధన్‌ రెడ్డి ప్రశ్నించారు.సీఎం నుంచి మంత్రుల వరుకు సమీక్షలతో నానాయాగి చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమీక్షలు ఎవరో అడ్డుకుంటున్నట్లు చంద్రబాబు  డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు,మంత్రులు క‌నీస అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతున్నార‌న్నారు.సమీక్షిస్తా..‘‘ఎవరూ అడ్డువస్తారో చూస్తా..లేదంటే రాజీనామా చేస్తా..కాదంటే సుప్రీంకోర్టుకు వెళ్తా’’ అని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారని.. దేనిమీద సమీక్ష చేయాలనుకుంటున్నారో స్పష్టత లేని పరిస్థితి ఉందని మండిపడ్డారు.

 రైతులు పండిచే ఫలసాయంపై మంత్రి సోమిరెడ్డికి దృష్టి ఉంటుంది తప్ప..వ్యవసాయం మీద కాదన్నారు. జూన్‌ 1 నుంచి ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం అవుతుంది.ఈ విషయం చంద్రబాబుమోహన్‌రెడ్డికి తెలియదా..అని ప్రశ్నించారు.ఆ సీజన్‌కు సంబంధించి జనవరిలోనే యాక్షన్‌ ప్లాన్‌ తయారుచేసుకుంటారన్నారు. సైక్లోన్‌ రివ్యూ పేరుతో చివరి అవకాశంగా భావించి నిధులు దొరికితే దిగమింగాలని ఆలోచనతో సమీక్ష చేస్తున్నారని విమర్శించారు. ఐదు సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉందని, రెండు సంవత్సరాలు సోమిరెడ్డి మంత్రిగా పనిచేశారని,  ఖరీఫ్‌లో 347 మండలాలు,రబీలో 250 మండలాలను కరువు మండలాలుగా డిక్లేర్‌ చేశారని..అధికారంలో ఉన్నపుడు ఎటువంటి సమీక్షలు జరిపి రైతులకు ఏవిధంగా అండగా ఉన్నావో సమాధానం చెప్పాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల సమస్యలు గుర్తుకురాలేదని..నేడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడుతున్నారన్నారు.

మార్చిలో మొదలు పెట్టితే మే నాటికి ధాన్యం కొనుగోలు పూర్తికావాలని..మార్చిలో ధాన్యం కొనుగోలుపై దృష్టిపెట్టకుండా..నేడు ధాన్యం కొనుగోలు పూర్తిఅయ్యే నేపథ్యంలో ఇప్పుడు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.గతసంవత్సరం సోమిరెడ్డి మంత్రిగా పనిచేశారని,ధాన్యం కొనుగోలుకు పది శాతం కూడా గిట్టుబాటు ధరలు కల్పించలేదన్నారు.మిలర్ల దగ్గర ముడుపులు తీసుకుని దళారీ వ్యవస్థను బలోపేతం చేశారని ధ్వజమెత్తారు.దళారీలు ద్వారా తక్కువ రేటుకు రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయించి వారి నడ్డి విరిచిన మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిందన్నారు.వ్యవసాయాన్ని టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. 87వేల 612 కోట్ల రూపాయలు రైతుల రుణాలు ఉంటే..2018 జూన్‌ నాటికి లక్షా 35వేల కోట్ల రూపాయలు ఇచ్చారు.

నేటికి లక్షా 50వేల కోట్ల రూపాయలకు రుణాలు చేరుతుందన్నారు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయలేకపోయారు కాని..రైతుల రుణభారాన్ని మాత్రం రెట్టింపు చేయడంలో టీడీపీ ప్రభుత్వం కిర్తీని సాధించిందని ఎద్దేవా చేశారు.దేశంలో అత్యధిక అప్పులు ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ రెండవస్థానంలో నిలిచిందని నాబార్డు S రిపోర్టు ఇచ్చిందన్నారు.దేశంలో రైతులకు అతితక్కువ ఆదాయం వచ్చే స్థానంలో ఏపీ ప్రథమం స్థానంలో ఉందని నివేదిక ఇచ్చిందన్నారు.మైక్రో ఫైనాన్స్‌ద్వారా దాదాపు 75 శాతం ప్రజలు అప్పులు తెచ్చుకున్నారని నాబార్డు వెల్లడించిందన్నారు.అభివృద్ధిలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపలేకపోయారు కాని..అవినీతి,అప్పుల్లో రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌ స్థానంలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుది అని అన్నారు.ఐదు సంవత్సరాలుగా బాధ్యతాయుతంగా వ్యవహరించలేని వారు..ఎన్నికల చివరి సమయంలో అధికారాలు గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.అవినీతి  ఆధారాలు తుడిచిపెట్టడానికి సమీక్షలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.సీఎస్‌ దానిని అడ్డుకుంటే నానాయాగి చేస్తున్నారని విమర్శించారు.
 

Back to Top