ఓటమి భయంతోనే ఈసీపై చంద్రబాబు ఆరోపణలు

చంద్రబాబు కేవలం అపద్దర్మ ముఖ్యమంత్రి మాత్రమే

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి

నెల్లూరు:చంద్రబాబు సమీక్షలు చేయాలని ఉవ్విళ్లూరుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఈసీకి పదేపదే విజ్ఞప్తులు చేస్తున్నారని పేర్కొన్నారు.చంద్రబాబు ఓటమి భయంతో ఎన్నికల సంఘంతో పాటు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.చంద్రబాబు కేవలం ఆపద్దర్మ  సీఎం మాత్రమేనని గుర్తించుకోవాలన్నారు.అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడిన సోమిరెడ్డిని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు గద్దెదించనున్నారని తెలిపారు.
 
 

Back to Top