చంద్రబాబూ.. ఇక రాజ‌కీయాల నుంచి వైదొలుగు..!

వైయ‌స్ జ‌గ‌న్ దేశంలోనే  మోడ‌ల్ సీఎం

వైయ‌స్ఆర్‌సీపీ నేత దాడి వీర‌భ‌ద్ర‌రావు

విశాఖపట్నం : గత ఏడాది కాలంగా చంద్రబాబు పాలన గాలికి వదిలేసారని  వైయ‌స్ఆర్‌సీపీ నేత దాడి వీర‌భ‌ద్ర‌రావు  విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఆదివారం విశాఖ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ  రాష్ట్రంలో గజ దొంగల పాలన పోయిందని.. టీడీపీ ఓటమి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్‌లు కారణంగా గుర్తించాలని  వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇక రాజకీయాల్లో నుంచి వైదొలగడం మంచిదని చెప్పారు. ప్రజలు అత్యంత హీనంగా టీడీపీని తిప్పి కొట్టారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోనే ఓ మోడల్‌ సీఎం అని పేర్కొన్నారు. దేశంలోని ఇతర పార్టీలు వైఎస్‌ జగన్‌ పాలన వైపు చూస్తున్నాయని తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top