టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయాలి

వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు  

నెల్లూరు జిల్లా: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహ‌న్ రెడ్డిపై  సోషల్ మీడియాలో అనుచిత, అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు నగరంలోని వేదాయపాళెం (5వ పట్టణ) పోలీసుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఫిర్యాదు చేశారు. పార్టీ జిల్లా అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి ఆధ్వ్యంలో భారీగా త‌ర‌లివ‌చ్చిన పార్టీ నేత‌లు పోలీసుల‌కు సాక్ష్యాధారాల‌తో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కార్య‌క్ర‌మంలో జెడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, రూరల్ ఇంచార్జి విజయ కుమార్ రెడ్డి, మాజీ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ చిల్లకూరు సుధీర్ రెడ్డి , మాజీ విజయడైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి , డీసీసీబీ మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి మహమ్మద్ ఖలీల్ అహ్మద్, ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఏమ‌న్నారంటే.. 

  • టీడీపీ కార్యకర్తలు వైయ‌స్ జ‌గ‌న్‌పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారు.
  • టీడీపీ సోషల్ మీడియా పోస్టులపై ఫిర్యాదు చేసినా, వారి మీద ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. పోలీసులు మీన మేషాలు లెక్కిస్తున్నారు.
  • వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడే.. టీడీపీ నేతలు వైయ‌స్ జ‌గ‌న్‌పై అనుచిత పోస్టులు పెట్టారు.. వాళ్ళ ఐడిలు సేకరించి.. పోలీసులకు ఫిర్యాదు చేశాం.
  • మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐటీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెచ్చిపోతున్నారు..
  • రాజ్యాంగం అందరికీ ఒక్కటే.. వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నట్లే.. టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చెయ్యాలి..
  • బ్రిటిష్ పాలనలో కూడా ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు లేవు..
  • వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలకు లోకేష్ మల్లే రెడ్ బుక్ అవసరం లేదు, మనపై అనుచితంగా ప్రవర్తిస్తున్నా, పోస్టులు పెడుతున్న వారి పేర్లు నమోదు చేసుకొని ఉంచుకోండి.
  • వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలను బాధపెట్టిన ఏ ఒక్కరిని విడిచిపెట్టం.
  • వైయ‌స్ జ‌గ‌న్‌ చెప్పిన విధంగా సప్త సముద్రాలు దాటి దాక్కున్న లాక్కోస్తాం.
  • కూటమిలో భాగస్వామ్యం అయిన బిజెపి దళిత నేత ఆవేదనను తెలియజేస్తే, నాపై కేసులు పెట్టారు
  • ఒక దళిత నాయకుని వద్ద లంచం అడిగిన సోమిరెడ్డిపై కేసు పెట్టకుండా, నాపై కేసులు నమోదు చేస్తున్నారు.
  • రేపు అనేది ఉందనే విషయాన్నీ టీడీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలి..
  • టీడీపీ నేతలే ఫెక్ ఐడి లు క్రియేట్ చేసి.. వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు పోస్ట్ లు పెట్టారని.. అక్రమ కేసులు పెడుతున్నారు..
  • పోలీసులు రాజ్యాంగబద్ధంగా మసులుకోకపోతే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది.
  • మా పిలుపుపై భారీగా తరలివచ్చి విజయవంతం చేసిన జిల్లాలోని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ  నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు, వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి  అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి పేర్కొన్నారు.
Back to Top