అమరావతి:నరసరావుపేట నియోజకవర్గంలో కోడెల ఎప్పడైనా ప్రోటోకాల్ పాటించారా అని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ గతంలో సత్తెనపల్లిలో గెలిచి నరసరావుపేటలో కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఎప్పుడైనా నరసరావుపేటలో గెలిచిన ఎమ్మెల్యేను పిలిచారా అని ప్రశ్నించారు. పార్టీ కార్యక్రమాల్లో ఏ స్పీకర్ అయినా పాల్గొంటారా.? కోడెల స్పీకర్ హోదాలో ఉండి కార్యకర్తల సమావేశం నిర్వహించడం వాస్తవం కాదా..పార్టీ కండువాలు కప్పలేదా..అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. స్పీకర్‌గా ఉండి వైయస్ జగన్‌ను తిట్టిన సందర్భాలు గుర్తుకులేదా అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి ట్విట్ చేసిన తర్వాతేనే కే ట్యాక్స్ మీద కేసులు ప్రారంభం అయ్యాయని కోడెల చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.అదేవిధంగా స్పీకర్ పదవికి ఏవిధమైన కళంకం తేలేదనే కోడెల వ్యాఖ్యలను ఖండించారు. కోడెల కుటుంబం చేసిన అరాచకాలు వెలుగు చూస్తున్నాయన్నారు. టీడీపీ కార్యకర్తలే కోడెలపై కేసులు పెడుతున్నారని తెలిపారు.నరసరావుపేటలో విచ్చలవిడి దోపిడీ జరిగిందన్నారు. నరసరావుపేటలో 8 కేసులు నమోదయ్యాయన్నారు.ఇంకా వందల మంది ఎదురుచూస్తున్నారన్నారు.కే ట్యాక్‌పై సిట్ లేదా సిబిసిఐడి విచారణ జరగాలన్నారు.