కాసేపట్లో సీఎం అధ్యక్షతన కేబినెట్‌ భేటీ

సచివాలయం: సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కాసేపట్లో మంత్రివర్గ సమావేశం జరుగనుంది. సచివాలయం చేరుకున్న సీఎం మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం కేబినెట్‌ భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో జీఎన్‌ రావు కమిటీ అందజేసిన నివేదికతో పాటు పలు కీలక అంశాలను చర్చించనున్నారు. కొత్తగా 104, 108 వాహనాల కొనుగోలు, దేవాలయాల్లో పాలక మండళ్ల నియామకాలకు సంబంధించి సవరణలపైనా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో అమలు చేయాల్సిన రిజర్వేషన్లపై కూడా కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. 
 

Back to Top