బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపాల్సిన అవసరం లేదు

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
 

అమరావతి: వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపాల్సిన అవసరం లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. నిబంధనల ప్రకారం చైర్మన్‌ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపకూడదని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై శాసన మండలిలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 13 జిల్లాల అభివృద్ధి కోసం ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌, కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో జ్యూడిషియల్‌ క్యాపిటల్‌, విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ఉంటుంది. అమరావతిలో శాసన సభ, శాసన మండలి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ ఉంటాయి అని పేర్కొన్నారు. 
 

Back to Top