పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ 

మంత్రి బొత్స‌సత్య‌నారాయ‌ణ‌
 

విశాఖపట్నం: గత ఏడాది రాష్టానికి 10 అవార్డుల వచ్చాయని ఏపీ మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి వచ్చిన అవార్డులు, గ్రాఫిక్స్‌ చూసి ఇచ్చిన అవార్డులు కాదని అన్నారు. కేంద్ర బృందాలకు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించాయని పేర్కొన్నారు. క్లాప్‌ అనే కార్యక్రమం ద్వారా పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని చెప్పారు.

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని బొత్స తెలిపారు. చెత్త సేకరణ కోసం ప్రతి ఇంటికి ప్రత్యేక టిన్నులను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా పారిశుద్ధ్య సిబ్బందికి ప్రత్యేక వాహనాలు అందించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సూచనలతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top