విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన బిల్లులకు గవర్నర్ రాజముద్ర వేశారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం-2014 రద్దు బిల్లుకు ఏపీ గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇకపై శాసన రాజధానిగా అమరావతి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుంది. రెండు బిల్లులకు జనవరిలో శాసన సభ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్13, 2019న రిటైర్డు ఐఏఎస్ అధికారి జీఎన్ రావు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డిసెంబర్ 20, 2019న పరిపాలన వికేంద్రీకరణకు ఈ కమిటీ సిపార్స్ చేసింది. దీంతో ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ కోసం ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.