వైజాగ్ :ఈనెల 15న రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వైయస్సార్ టియుసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఎక్కువ శాతం కార్మిక వర్గాలు మేలు పొందాయని ఆయన అన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 18 వేలు వేతనం ఇస్తామని అమలు చేసిన నాయకుడు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసి అనూహ్య మేలు చేశారని తెలిపారు. విజయవాడ కేంద్రంగా ఓ మాఫియా వైయస్ జగన్ మోహన్‌రెడ్డిపై విషం చిమ్ముతున్నారని, కార్మికులకు జరిగిన మేలుపై చర్చకు రండి అంటూ టిడిపి నాయకులకు గౌతమ్ రెడ్డి సవాలు విసిరారు. ఐటి హబ్ పేరిట విశాఖలో నిధులు దోచుకున్న ఘనుడు చంద్రబాబు నాయుడు అంటూ ఫైర్ అయ్యారు. ఈ నెల 24న హాకర్స్ కు పదివేలు ఇవ్వడం కూడా పాదయాత్ర ఫలితమేనన్నారు. ఇప్పుడు కార్మికలు జయహో జగన్ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని కొనియాడారు. ప్రధాని మోదీ కూడా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనను అభినందించడం నిజాయితీ పాలనకు నిదర్శనం అని పేర్కొన్నారు.