సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు భారతి సిమెంట్స్‌ రూ.5 కోట్ల విరాళం

 అమరావతి : కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్కరు తమవంతుగా సహాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే పలు కార్పొరేట్‌ సంస్థలు ఏపీకి భారీ విరాళాలు ప్రకటించగా..తాజగా భారతి సిమెంట్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీసీసీపీఎల్‌) తనవంతు సహాయాన్ని అందించింది. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకుగాను సీఎం సహాయనిధికి రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. అలాగే భారతి సిమెంట్స్‌ ఉద్యోగులు 14.5 లక్షల విరాళాన్ని అందజేశారు. వర్షిని చారిటబుల్‌ ట్రస్ట్‌ రూ.1.10 కోట్లు విరాళం ప్రకటించింది.  

ఏపీ సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు 
పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మైనింగ్‌ శాఖల విరాళం : రూ. 200.11 కోట్లు
ఏపీఎండీసీ విరాళం : రూ. 10.62 కోట్లు
మైన్స్‌ అండ్‌ జియాలజీ శాఖ విరాళం : రూ. 56 లక్షలు
ఉపాధి హామీ, వాటర్‌షెడ్‌ శాఖ విరాళం : రూ. 1.50 కోట్లు
సెర్ఫ్‌ఉద్యోగుల విరాళం : రూ. 50 లక్షలు  

Back to Top