వైయస్‌ఆర్‌సీపీకి బ్రాహ్మణ సంఘాల మద్దతు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. తాజాగా బ్రాహ్మణ సంఘాలు మద్దతు ప్రకటించాయి. విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు బ్రాహ్మణులకు ఒక్క సీటు కూడా కేటాయించలేదన్నారు. బ్రాహ్మణులను అణగదొక్కాలని టీడీపీ చూస్తోందని ఆ సంఘం నాయకుడు లక్ష్మీపతిరావు అన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీకి చెందిన ఫ్యాన్‌ గుర్తుకు బ్రాహ్మణులు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు.
 

Back to Top