మేము తలుపులు తెరిస్తే టీడీపీలో మిగిలేది వారిద్దరే

మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి

ప్రకాశం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మేము తలుపులు తెరిస్తే టీడీపీలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు తప్ప ఎవరూ మిగలరు అంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ విషయంలో కోర్టుకు వెళ్లలేదని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు.   బాలినేని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సముచిత స్థానం కల్పిస్తుంటే ఎల్లో మీడియాకు కడుపు మండుతోంది. మేము తలుపులు తెరిస్తే టీడీపీలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు తప్ప ఎవరూ మిగలరు. 40 మంది మా పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీకి టచ్‌లో ఉంటే ఇద్దరు ఎమ్మెల్యేలను ఎందుకు కొనుకున్నారు?. ఒంగోలులో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకంది టీడీపీనే. పేదల స్థలాలపై టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లారని దేవుడి సాక్షిగా నేను ప్రమాణం చేస్తాను. కోర్టుకు వెళ్లలేదని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని టీడీపీ నేతలకు సవాల్‌ విసిరారు. 

 

Back to Top