వ్యవస్థలను చంద్రబాబు భ్రష్టుపట్టించారు

  • దొంగ సర్వేల పేర్లతో వైయస్‌ఆర్‌ సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగిస్తున్నారు
  • పోలీసులను రాజకీయ స్వార్థానికి ఉపయోగిస్తున్నారు
  • వీటన్నింటిపై గవర్నర్‌కు సుదీర్ఘంగా వివరించాం
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

హైదరాబాద్‌: వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాజకీయ స్వార్థం, అవసరాల కోసం పోలీసులను వాడుకుంటున్నారన్నారు. సర్వేల పేర్లతో చంద్రబాబు చేస్తున్న కుట్రలను గవర్నర్‌కు సుదీర్ఘంగా వివరించడం జరిగిందని వైయస్‌ జగన్‌ చెప్పారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో జననేత భేటీ అయ్యారు. భేటీలో రాష్ట్రంలో చంద్రబాబు అధికార దుర్వినియోగం గురించి వివరించారు. అనంతరం రాజ్‌భవన్‌ వద్ద వైయస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన అంశాలను గవర్నర్‌ దృష్టికి తెచ్చామన్నారు. రాష్ట్రంలో దాదాపు 59.18 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని, వాటిని తొలగించాల్సిన అవసరం తెలియజేశామన్నారు. అంతేకాకుండా దొంగ సర్వేల పేర్లతో తెలుగుదేశం గవర్నమెంట్‌ మెషినరీ ద్వారా ప్రజా సాధికార సర్వే, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్, పరిష్కార వేదిక అంటూ పీరియాడిక్‌ సర్వేల పేరుతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతి పరుల ఓట్లను గుర్తించి వాటిని తొలగిస్తుందన్నారు. ఈ విషయాలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. 

పోలీస్‌ వ్యవస్థను చంద్రబాబు ఇష్టారీతిగా వాడుకుంటున్న విషయాన్ని, పోలీస్‌ ఆఫీసర్ల పదోన్నతుల అక్రమాలపై గవర్నర్‌కు వివరించామని వైయస్‌ జగన్‌ వివరించారు. చంద్రబాబు ఆధ్వర్యంలో పోలీస్‌ వ్యవస్థ అతి దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వం రాజకీయ స్వార్థం కోసం, అవసరాల కోసం పోలీసులను ఎలా ఉపయోగించుకుంటున్నారో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు చెప్పిన విషయాలను గవర్నర్‌కు వివరించామన్నారు. చంద్రబాబు చేస్తున్న కుట్రలపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. 
 

Back to Top