ఈనెల 26 వ‌ర‌కు అసెంబ్లీ.. బీఏసీ నిర్ణ‌యం

తాడేప‌ల్లి: ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ఈ నెల 26 వరకు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. శాస‌న‌స‌భ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో బీఏసీ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్, మంత్రులు బుగ్గన, అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు, చీఫ్ విప్ గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్య‌ద‌ర్శి బాల‌కృష్ణ‌మాచార్యులు, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హజరయ్యారు. ఈనెల 26 వ‌ర‌కు శాస‌న‌స‌భ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని బీఏసీ నిర్ణ‌యించింది.

తాజా ఫోటోలు

Back to Top