అమరావతి: ఆర్బీకేలతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తున్నామని, ఈ మూడేళ్లలో 98.4 శాతం హామీలు అమలు చేశామని చెప్పారు. బాబు హయాంలో ప్రతి సంవత్సరం కరువే. కరువు, బాబు ఇద్దరూ కవలలు అని ఎద్దేవా చేశారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కుప్పం నుంచి ఇచ్చాపురం వరు వాగులు, వంకలు కళకళలాడుతున్నాయన్నారు. రాష్ట్రంలోని 5 ప్రధాన నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కృష్ణా, గోదావరి డెల్టాలతోపాటు రాయలసీమ రైతులకు అత్యధికంగా సాగునీరు. గత మూడేళ్లలో రికార్డు స్థాయిలో పంట దిగుబడులు. సగటున 13, 29 లక్షల టన్నుల దిగుబడి పెరిగింది. రైతులో కాదు.. రైతుల కూలీలూ సంతోషంగా ఉన్నారని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఎక్కడా కూడాఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు..చేయం, చేయబోమని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నొక్కి ఒక్కానించారు. విద్యుత్ మీటర్లు ఏర్పాటు వల్ల నాణ్యమైన విద్యుత్ అందించగలం..మోటర్లు కాలిపోవు అన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై అసెంబ్లీలో బుధవారం చర్చ జరిగింది. ఈ సందర్బంగా సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏమన్నారంటే.. రూ.87,612 కోట్లు రుణమాపీ చేస్తానని చంద్రబాబు 2014 ఎన్నికల సమయంలో వాగ్ధానం చేశారు . కేవలం రూ.15 వేల కోట్లు చెల్లించారు. రైతుల రుణమాఫీపై చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మార్చారు. రుణమాఫీ చేయకుండా చంద్రబాబు రైతులను దగా చేశారు చివరికి రైతులకు సున్నా వడ్డీని బాబు ఎగ్గొట్టారు చంద్రబాబు హయాంలో రైతులకు బీమా పరిహారం అందలేదు బాబు లాంటి వారి వల్లే మేనిఫెస్టోకు విలువ లేకుండా పోయింది ఈ మూడేళ్లలో 98.4 శాతం హామీలు అమలు చేశాం రైతులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం ఆర్‌బీకేలతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు మూడేళ్లలో ఒక్క మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాల్సిన అవరసం రాలేదు. చంద్రబాబు హయాంలో ప్రతి సంవత్సరం కరవే కరవు, చంద్రబాబు ఇద్దరూ కవలలు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు చెరువులు, వాగులు, వంకలు కళకళలాడుతున్నాయి రాష్ట్రంలోని ఐదు ప్రధాన నదులు పరవళ్లు తొక్కుతున్నాయి కృష్ణా, గోదావరి డెల్టాలతో పాటు రాయలసీమ రాయలసీమ రైతులకు అత్యధికంగా సాగునీరు గత మూడేళ్లలో రికార్డుస్థాయిలో పంట దిగుబడులు సగటున 13.29 లక్షల టన్నుల దిగుబడి పెరిగింది రైతులే కాదు..రైతు కూలీలూ సంతోషంగా ఉన్నారు రైతు భరోసా కింద 52 లక్షల 38 వేల మంది రైతులకు ఇప్పటి వరకు రూ.23,875 కోట్లు ఇచ్చాం ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టాన్ని ఆ సీజన్‌లోనే చెల్లిస్తున్నాం దేశంలో ఎక్కడా లేనివిధంగా వాస్తవ సాగుదారులకే బీమా రక్షణ రైతులకు వడ్డీ రాయితీ నవంబర్‌లో అందిస్తాం. సున్నా వడ్డీ కింద నేరుగా రైతుల ఖాతాల్లో వడ్డీ జమ చేస్తున్నాం. మూడేళ్లలో 65.65 లక్షల మంది రైతులకు రూ.1,282 కోట్లు చెల్లించాం మూడేళ్లలో 20 లక్షల మంది రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ అందించాం రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి ఏర్పాటుతో రైతులకు సాయం రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు పెద్ద విప్లవాత్మక మార్పు ఈ 40 నెలల్లో వ్యవసాయ రంగంలో రూ.1,28,634 కోట్లు ఖర్చు రైతు భరోసా కింద ఐదేళ్లలో రూ.50 వేలు ఇస్తామని చెప్పి రూ.67,500 ఇస్తున్నాం విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతులకు అండగా ఉంటున్నాం నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల నుంచి ఆర్బీకేలకు ప్రశంసలు 147 గ్రామీణ నియోజకవర్గాల్లో వైయస్‌ఆర్ ౖఅగ్రీల్యాబ్స్ ఏర్పాటు రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ మోటార్లకు మీటర్ల ఏర్పాటుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడా..ఏ రైతు నుంచీ రూపాయి వసూలు చేయలేదు..చేయం, చేయబోం మోటార్లకు మీటర్లతో నాణ్యమైన విద్యుత్ అందించగలం ఆర్‌బీకేల పరిధిలోకి కిసాన్ డ్రోన్లను తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాం చంద్రబాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకున్నాం ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున సాయం కౌలు రైతులకు మంచి జరగాలని, బ్యాంకుల నుంచి రుణాలు అందాలని 2019లో పంటల సాగుదారుల హక్కు చట్టం తీసుకువచ్చాం. రైతుల భాగస్వామ్యంతో పంటల ప్రణాళిక రూపొందించేందుకు వ్యవసాయ సలహా మండలిలు ఏర్పాటు చేశాం. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి మండలిలో 1.15 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. 67 శాతం రైతు కుటుంబాలకు సగటున పొల ఒక ఎకరా ఐదు సెంట్లు 87 శాతం కుటుంబాలకు మన నవరత్నాల్లోని ప్రతిదీ కూడా అందిస్తున్నాం కాబట్టి రైతుల వలసలు తగ్గిపోయాయి. ఇవన్నీ కూడా మన ప్రభుత్వ విజయాలు గతంలో లేని పథకాలు, మార్పులు ఈ విజయాలకు దోహదపడుతున్నాయి. ఇవేవి కూడా చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు కనబడటం లేదు. దళారీ వ్యవస్థను నిర్మూలించాం. రైతులకు తన గ్రామంలోనే అండగా నిలిచాం. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను పగటి పూట ఇవ్వడం. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇవ్వగలిగాం. ప్రతి పేద రైతు అన్నం తిన్నాడా? లేదా అన్నది మా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఆ రైతు కుటుంబంలో పిల్లలు బడికి వెళ్తున్నారా?. పింఛన్, ఆసరా, ఉచిత ఇళ్ల పట్టాలు వంటివి ఇవ్వగలిగాం. పాడి రైతులకు మరో 5 రూపాయిలు పెంచి ఇస్తున్నాం. యానిమల్ అంబులెన్స్‌లు ఏర్పాటు చేశాం. 2 లక్షల బోర్లు ఏర్పాటు చేశాం. రైతులకు మంచి జరగాలంటే మన అడుగులు సరిగ్గా పడ్డాయా లేదా అన్నది ఆలోచన చేయాలి. ప్రతి రైతుకు, ప్రతి కుటుంబానికి మంచి చేయాలని మనసు పెట్టి ఆలోచన చేశాను. ప్రతి కుటుంబానికి మంచి చేశానని గర్వంగా చెబుతున్నాను. ఇవన్నీ కూడా దేవుడిదయతో మంచి చేశాను. ఇంకా మంచి చేయాలని దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుతూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సెలవు తీసుకున్నారు.