కొత్త పాతల కలయికతో అసెంబ్లీ అభ్యర్ధుల జాబితా

 • 45 ఏళ్లలోపువారు 33 మంది
 • 45 నుంచి 60 ఏళ్లలోపు వారు 98 మంది
 • 60 ఏళ్లకు పైబడ్డ వారు  44 మంది
 • సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు 40 మంది

హైదరాబాద్:  కొత్త పాతల కలయికతో అనుభవానికి యువతరానికి ప్రాధాన్యతనిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించింది. ఉన్నత విద్యావంతులు, డాక్టర్లు, ఐఎఎస్, ఐపిఎస్, ఐఆర్ఎస్ లాంటి సర్వీసుల్లో పనిచేసిన వారినే కాకుండా, గతంలో మంత్రులుగా పనిచేసిన వారిని కూడా అభ్యర్ధులుగా ఎంపిక చేసుకుని , రాష్ట్రానికి చక్కటి పాలన అందించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న తన సంకల్పాన్ని చాటుకుంది. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి, పలు దఫాలుగా కోర్ కమిటీతో చర్చలు జరిపి అభ్యర్ధుల ఎంపికలో తనదైన ప్రత్యేకత ఉండేలా, ప్రజల్లో విశ్వసనీయత, నమ్మకం పెరిగే విధంగా తన టీం ను ఎంపిక చేసుకున్నారు. మరోవైపు సామాజిక సమతుల్యతను పాటిస్తూ బీసీలు, మైనార్టీలు ఇతర వర్గాలకు మంచి ప్రాధాన్యత కల్పించారు.

పార్టీ విడుదల చేసిన అభ్యర్ధుల జాబితాను ఒకసారి విశ్లేషిస్తే...

 •  అనుభవానికి, నమ్మకానికి, పెద్దపీట
 • యువతకు సముచిత ప్రాధాన్యం
 • బీసీలు 41 మంది
 • మహిళలు 15 మంది
 • మైనార్టీలు 5 మంది 
 • ఆలిండియా సర్వీసుల్లో పనిచేసిన వారు 9 మంది
 • డాక్టర్లు 15 మంది
 • 45 ఏళ్లలోపువారు 33 మంది
 • 45 నుంచి 60 ఏళ్లలోపు వారు 98 మంది
 • 60 ఏళ్లకు పైబడ్డ వారు 44 మంది
 • సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు 40 మంది
 • ఎమ్మెల్సీలు ముగ్గురికి ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం
 • గతంలో మంత్రులుగా పనిచేసినవారు 12 మంది
 • మాజీ ఎంపీలు ఇద్దరు
 • మాజీ ఎమ్మెల్యేలు  37 మంది
 • మాజీ ఎమ్మెల్సీ 1
 • ఎంపీలుగా పోటీచేసిన వారు 3
 • పోస్ట్‌గ్రాడ్యుయేట్లు 41 మంది
 • గ్యాడ్యుయేట్లు 98
 • మొత్తమ్మీదకు డిగ్రీ, ఆపైబడి చదివిన వారు 139 మంది

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top