ముఖ్య‌మంత్రిని క‌లిసిన ఏపీఎన్జీవోస్‌ అసోసియేషన్‌ నూతన కార్య‌వ‌ర్గం

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఏపీఎన్టీవోస్ అసోసియేష‌న్ నూత‌న కార్య‌వ‌ర్గ స‌భ్యులు తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఏపీఎన్జీవోస్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కే.వి. శివారెడ్డి, పలువురు ప్యానల్‌ సభ్యులు సీఎంను క‌లిశారు. ఈ మేర‌కు నూత‌న కార్య‌వ‌ర్గానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఏపీఎన్జీవోస్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ సభ్యులు పి. పురుషోత్తం నాయుడు, డి.వి.రమణ, పి.కృష్ణ, సీహెచ్‌.శ్రీనివాసరావు, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్‌.చంద్రశేఖర్‌ రెడ్డి ఉన్నారు. 

Back to Top