వైయస్‌ఆర్‌సీపీలోకి ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌

వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన శివరామ సుబ్రహ్మణ్యం
 

రాజమండ్రి: ఎన్నికల షెడ్యూల్‌ వెలుబడిన మరుసటి రోజే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి ఇతర పార్టీల నేతలు క్యూకడుతున్నారు. ఇవాళ ఉదయం సినీ నటుడు అలీ, మంత్రి దేవినేని ఉమా సోదరుడు దేవినేని చంద్రశేఖర్‌ వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. కొద్దిసేపటి క్రితం ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ శివరామసుబ్రహ్మణ్యం వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైయస్‌ జగన్‌ సమక్షంలో శివరామసుబ్రహ్మణ్యం పార్టీలో చేరారు. ఆయన్ను వైయస్‌ జగన్‌ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మార్పు తూర్పు గోదావరి జిల్లా నుంచే మొదలైందని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటామని ఆయన దీమా వ్యక్తం చేవారు.
 

Back to Top