అమరావతి : లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైnస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను gramasachivalayam.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఈ నెల ఒకటి నుంచి 8 వ తేదీ వరకూ ఎపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలను నిర్వహించింది. 19 రకాల పోస్టులకుగాను 14 పరీక్షలు నిర్వహించిన ఏపీ ప్రభుత్వం.. కేవలం 10 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలకు 19.74 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఎన్నికైన అభ్యర్థులకు ఈ నెల 30 నుంచి అక్టోబర్ 1వరకు శిక్షణ ఇస్తారు. పరీక్ష విడుదల కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.