ఉగాది రోజున వాలంటీర్లకు సత్కారం

ఉత్తర్వులు జారీ చేసిన ప్ర‌భుత్వం

 తాడేపల్లి: ఉగాది రోజున ఉత్తమ గ్రామ, వార్డు వాలంటీర్లకు సత్కరించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పేరిట మూడు కేటగిరీలుగా వార్డు, గ్రామ వార్డు వాలంటీర్లను ప్రభుత్వం సత్కరించనుంది. సేవా వజ్రకు రూ.30 వేలు, సేవారత్నకు రూ.20 వేలు, సేవా మిత్రకు రూ.10 వేల నగదు పురస్కారం, శాలువాతో ప్రభుత్వం సత్కరించనుంది. ప్రకృతి వైపరీత్యాల్లో అందించిన సేవలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనుంది. ఈ నెల 13న గ్రామ, వార్డు వాలంటీర్లను సత్కరించే కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

Back to Top