విద్యార్థుల మొబైల్‌ నంబర్లకు కూడా ర్యాంకుల వివరాలు  

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

తాడేప‌ల్లి : విద్యార్థుల మొబైల్‌ నంబర్లకు కూడా ర్యాంకుల వివరాలు వస్తాయని మంత్రి  ఆదిమూల‌పు సురేష్ తెలిపారు.
ఏపీ ఎంసెట్‌–2020 ఫలితాలను మంత్రి ఆదిమూల‌పు సురేష్‌ శనివారం విడుదల చేశారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 84.78 శాతం, అగ్రికల్చర్‌, మెడిసిన్‌ విభాగంలో 91.77 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఆన్‌లైన్‌ (సీబీటీ) విధానంలో జరిగిన ఈ పరీక్షలను హైదరాబాద్‌తో పాటు ఏపీలోని మొత్తం 47 నగరాల్లో 118 కేంద్రాల్లో నిర్వహించారు. గత నెల సెప్టెంబర్‌ 17వ తేదీ నుంచి 25 వరకు ఉదయం, మధ్యాహ్నం మొత్తం 14 సెషన్లలో పరీక్షలు జరిగాయి. 9 సెషన్లలో జరిగిన ఇంజనీరింగ్‌ విభాగానికి 1,85,946 మంది దరఖాస్తు చేయగా 1,56,899 మంది (84.38 శాతం) పరీక్ష రాశారు. ఈనెల 23వ తేదీ నుంచి 25 వరకు అగ్రి, మెడికల్‌ విభాగం పరీక్షలు జరగ్గా మొత్తం 87,652 మందికి గాను 75,834 (86.52%) మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్‌ విభాగంతో  1,33,066 మంది విద్యార్థులు, అగ్రికల్చర్‌, మెడిసిన్ విభాగంలో 69,616 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు ఎంసెట్‌ ఫలితాలను www.sakshieducation.comలో చూసుకోవచ్చు. 

ఇంజినీరింగ్‌లో ర్యాంకర్లు వీరే

ఫస్ట్‌ ర్యాంక్‌ : వావిలపల్లి సాయినాథ్(విశాఖ)
రెండో ర్యాంక్ : కుమార్ సత్యం (హైదరాబాద్)
మూడో ర్యాంక్:  గంగుల భువన్‌రెడ్డి(ప్రొద్దుటూర్) 
నాలుగో ర్యాంక్:  లిఖిత్‌ రెడ్డి(హైదరాబాద్)
ఐదో ర్యాంక్‌:  కౌశల్ కుమార్( సికింద్రాబాద్)
ఆరో ర్యాంక్‌ : శ్రీహర్ష (రాజమండ్రి)
ఏడో ర్యాంక్:  సాయితేజ వారణాసి ( హైదరాబాద్)
ఎనిమిదో ర్యాంక్ : హార్ధిక్ రాజ్‌పాల్( హైదరాబాద్)
తొమ్మిదో ర్యాంక్:  కృష్ణసాయి( శ్రీకాకుళం)
పదో ర్యాంక్‌:  జితేంద్ర( విజయనగరం)
అగ్రికల్చర్‌, మెడిసిన్‌లో ర్యాంకర్లు వీరే

ఫస్ట్‌ర్యాంక్‌: చైతన్య సింధు(తెనాలి)  
రెండో ర్యాంక్: లక్ష్మి సామయి మారుతి (తాడికొండ)
మూడో ర్యాంక్ : మనోజ్‌ కుమార్ (తిరుపతి)
నాలుగో ర్యాంక్:  దరశి విష్ణుసాయి( నెల్లూరు)
ఐదో ర్యాంక్:  సుభాంగ్ ( హైదరాబాద్)
ఆరో ర్యాంక్:  హవీష్‌రెడ్డి(హైదరాబాద్)
ఏడో ర్యాంక్:  లిఖిత (కడప)
ఎనిమిదో ర్యాంక్:  జడ వెంకటవినయ్(వేంపల్లి)
తొమ్మిదో ర్యాంక్:  నితిన్ వర్మ(కర్నూలు)
పదో ర్యాంక్:  రేవంత్ (గుంటూరు)

Back to Top