సమన్యాయం చేయటమే సీఎం వైయ‌స్ జగన్‌ లక్ష్యం 

 ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి

తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని రైతులకు న్యాయం చేస్తారని, ఆయన రైతుల పక్షపాతి అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయటమే సీఎం వైయ‌స్ జగన్‌ లక్ష్యమని పేర్కొన్నారు. శనివారం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ 7 నెలల్లోనే 90 శాతం హామీలను నెరవేర్చారు. మూడు రాజధానుల ప్రతిపాదనను అన్ని వర్గాలు హర్షిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు తాత్కాలిక భవనాలు కట్టడం తప్ప ఏమీ చేయలేదు. తన ఆస్తులను కాపాడుకోవటం కోసమే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. తన స్వార్థం కోసం చంద్రబాబు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. పేదలు, విద్య, వైద్యం కోసం చంద్రబాబు ఎప్పుడూ ఆలోచించలేదు. పేదపిల్లల చదువుకోసం వైయ‌స్‌ జగన్‌ అమ్మ ఒడి పథకం తీసుకొచ్చారు. మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం ఉండేలా మెను మార్పు చేశాం. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తున్నా’మని తెలిపారు.

Back to Top