ప్రధాని మోదీకి సీఎం వైయస్‌ జగన్‌ లేఖ

తాడేపల్లి: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ‌లు రాశారు. తక్షణ వరద సాయం కింద రూ. 1000 కోట్లు మంజూరు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ కోరారు. ఏపీలో వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపించాలని లేఖలో పేర్కొన్నారు. ఐఎంసీటీ బృందాలను రాష్ట్రానికి పంపించాలని, భారీ వర్షాల వల్ల రూ.6,054 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం వైయస్‌ జగన్‌ లేఖలో పేర్కొన్నారు.

``భారీ వర్షాల వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయింది. తక్షణ వరద సాయం కింద రూ. వెయ్యి కోట్లు మంజూరు చేయాలి. వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపించాలి. ఐఎంసీటీ బృందాలను రాష్ట్రానికి పంపాలి. భారీ వర్షాల వల్ల రూ.6,054 కోట్ల నష్టం వాటిల్లింది. నాలుగు జిల్లాల్లో అసాధారణ వర్షపాతం నమోదైంది. చాలాచోట్ల 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. తిరుపతి, తిరుమలలో భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. నెల్లూరు, మదనపల్లె, రాజంపేటలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది. 196 మండలాలు నీట మునిగాయి. 324 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో రహదారులు, చెరువులు, కాల్వలు కోతకు గురయ్యాయి. చెరువులకు గండ్లు పడడం వల్ల చాలా ప్రాంతాలు నీటమునిగాయి`` అని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకి రాసిన లేఖ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు. 

ఏపీలోని వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవ‌ల ప్రధాని మోదీకి ఫోన్‌లో వివ‌రించారు.  ప్రభుత్వ చర్యలను, 5 జిల్లాలోని వర్షాల పరిస్థితులను ప్రధాని మోదీకి సీఎం వైయ‌స్‌ జగన్‌ వివరించారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని ఆ సంద‌ర్భంలో ప్ర‌ధాని మోదీ హామీ ఇచ్చారు. 

తాజా ఫోటోలు

Back to Top