గుంటూరు: సీనియర్ జర్నలిస్ట్ ఆనంద్ కుమార్ ఆకస్మిక మృతిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆనంద్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆనంద్ ఢిల్లీలో గత 35 ఏళ్లుగా వివిధ మీడియా సంస్థల్లో జర్నలిస్టుగా పనిచేశారని ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలోని ఏపీ ప్రభుత్వ సలహాదారు (నేషనల్ మీడియా) కార్యాలయంలో మీడియా కోఆర్డినేటర్ ఆనంద్ కుమార్ పని చేశారు. అంతకు ముందు దాదాపు నాలుగు దశాబ్దాలపాటు తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో పని చేశారాయన. తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అనారోగ్యంతో ఢిల్లీలోని సర్దార్ పటేల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. మరోవైపు ఆనంద్ మృతి పట్ల జర్నలిస్ట్ యూనియన్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి.